రచన: భక్త రామదాసు ( కంచర్ల గోపన్న)
రాగం: మాయమాలవ గౌళ
తాళం: ఏక
పల్లవి:
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవా బృందలోలం ।। నందబాలం ।।
చరణాలు:
జలజ సంభవాది వినుత చరణారవిందం
లలితమోహన రాధావదన నళిన మిళిందం ।। 1 ।।
నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
ఘటిత శోభిత గోపికా ధర మకరందం ।। 2 ।।
గోదావరీ తీర రాజగోపికా రామ కృష్ణం
ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం ।। 3 ।।
No comments:
Post a Comment