Saturday, 31 January 2015

కంజదళాయతాక్షి....

రచన: శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
రాగం: కమలమనోహరి
తాళం: ఆది

పల్లవి:
కంజదళాయతాక్షి కామాక్షి
కమలామనోహరి త్రిపురసుందరి ।।కంజ ।।

అనుపల్లవి:
కుంజరగమనే మణిమండిత మంజులచరణే
మామవశివ పంజరశుఖి పంకజముఖి
గురుగుహ రంజని నిరంజని దురితభంజని ।। కంజ ।।

చరణం:
రాకాశశివదనే సురదనే
రక్షితమదనే రత్నసదనే
శ్రీ కంచనవాసనే సురాసనే
శృంగారాశ్రయ మందహాసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందమృతఝరి భాస్వరి
ఏకాగ్రమనోలయకారి శ్రీకరి
ఏకామ్రేశగృహేశ్వరి శంకరి. ।। కంజ ।।

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...