Monday, 16 February 2015

శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం...

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమశివాయ ।।

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ
తస్మై “మ” కారాయ నమశివాయ ।।

శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభద్వజాయ
తస్మై “శి” కారాయ నమశివాయ ।।

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమశివాయ ।।

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమశివాయ ।।

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ।।

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...