రచన: శ్రీ త్యాగరాజు
రాగం: రవి చంద్రిక
తాళం: దేశాది
పల్లవి:
మాకేలరా విచారము
మరు-కన్న శ్రీ రామచంద్ర ।। మాకేల ।।
అనుపల్లవి:
సాకేత రాజకుమార
సద్భక్త మందార శ్రీకర ।। మాకేల ।।
చరణం:
జత కూర్చి నాటక సూత్రమును
జగమెల్ల మెచ్చగ కరముననిడి
గతి తప్పక ఆడించెదవు సుమీ
నత త్యాగరాజ గిరీశ వినుత ।। మాకేల ।।
No comments:
Post a Comment