Wednesday, 18 February 2015

నారాయణతే నమో నమో...

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు...
రాగం: బేహాగ్
తాళం: ఆది

పల్లవి:
నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ।।నారాయణ ।।

చరణాలు:
మురహర భవహర ముకుంద మాధవ
గరుడగమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగ శరీర నమో నమో ।। నారాయణ ।।

జలధిశయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూ వల్లభ
నళినోదర తే నమో నమో ।। నారాయణ ।।

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్దర శ్రీవేంకటనాయక
నాదప్రియతే నమో నమో ।। నారాయణ ।।

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...