రచన: భక్త రామదాసు
రాగం: కళ్యాణి
తాళం: త్రిపుట
పల్లవి:
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి ననుబ్రోవమని ॥ నను ॥
చరణాలు:
ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ ॥ 1 ॥
ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కు చుండెడివేళ ॥ 2 ॥
ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేక శయ్య నున్నవేళ॥ 3 ॥
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి ॥ 4 ॥
No comments:
Post a Comment