రచన: భక్త రామదాసు
రాగం: కాపీ
తాళం: ఆది.
పల్లవి:
చరణములే నమ్మితి నీ
దివ్యచరణములే నమ్మితి ॥ చరణములే ॥
చరణాలు:
వారధిగట్టిన వరభద్రాచల
వరదా వరదా వరదా నీదివ్య ॥ 1 ॥
ఆదిశేష నన్నరమర చేయకు
మయ్యా అయ్యా అయ్యా నీదివ్య ॥ 2 ॥
వనమున రాతిని వనితగ చేసిన
చరణం చరణం చరణం నీదివ్య ॥ 3 ॥
పాదారవిందమే యాధారమని
నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య ॥ 4 ॥
వెయ్యారు విధముల కుయ్యాలించిన
అయ్యా అయ్యా అయ్యా నీదివ్య ॥ 5 ॥
బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ
దాసుడ దాసుడ నీ దివ్య ॥ 6 ॥
No comments:
Post a Comment