రచన: త్యాగరాజు
రాగం: బిళహరి
తాళం: త్రిపుట
పల్లవి:
నరసింహ నన్ను బ్రోవవే శ్రీ లక్ష్మీ ॥ నర॥
అని పల్లవి:
కొర-మాలిన నరుల కొనియాడను నేను
పరమ పావన నాపాలి శ్రీ లక్ష్మీ ॥నర ॥
చరణములు:
నీదు భక్తాగ్రేసరుడు
ప్రహ్లాదుడపుడొక కనక కశిపు
వాదుకోర్వక నిన్ను శరణని-
యాదుకోమన కాచినావు ॥ 1 ॥
ఎందుకని సైరింతు నీ
మనసందు తెలియనిదియేది లోకుల
నిందకోర్వక నిన్ను
కోరినందుకెంతని కరుణ జూతువో ॥ 2 ॥
నీ జపము నీ స్మరణ నీ పద
పూజ నీ వారి చెలిమియొసగి
రాజిగా దయ చేయు
త్యాగరాజ సన్నుత తరము కాదు ॥ 3 ॥
No comments:
Post a Comment