Tuesday, 24 February 2015

ఆలోకయే శ్రీ బాలకృష్ణం...

రచన: శ్రీ నారాయణ తీర్థులు
రాగం: హుశేని
తాళం: ఆది

పల్లవి:
ఆలోకయే శ్రీబాలకృష్ణం - సఖి
ఆనందసుందరతాండవ కృష్ణమ్‌॥ ఆలోకయే॥

చరణములు:

నవనీతఖండదధిచోరకృష్ణం - భక్త
భవపాశ బంధ మోచన కృష్ణమ్‌॥ 1 ॥

నీలమేఘశ్యామసుందర కృష్ణం - నిత్య
నిర్మలానందబోధలక్షణ కృష్ణమ్‌॥ 2 ॥

చరణ నిక్వణితనూపురకృష్ణం - కర
సంగత కనకకంకణ కృష్ణమ్‌॥ 3 ॥

కింకిణీజాలఘణఘణితకృష్ణం - లోక
శంకితతారావళిమౌక్తిక కృష్ణమ్‌॥ 4 ॥

సుందర నాసామౌక్తికశోభితకృష్ణం - నంద
నందన మఖండవిభూతి కృష్ణమ్‌॥ 5 ॥

కంఠోపకంఠశోభికౌస్తుభకృష్ణం - కలి
 కల్మషతిమిరభాస్కర కృష్ణమ్‌॥ 6 ॥

వంశనాదవినోదసుందరకృష్ణం - పరమ
హంసకులశంసితచరిత కృష్ణమ్‌॥ 7 ॥

గోవత్స బృందపాలకకృష్ణం - కృత
గోపికాజాలఖేలన కృష్ణమ్‌॥ 8 ॥

నందసునందాదివందితకృష్ణం - శ్రీ
నారాయణతీర్థ వరద కృష్ణమ్‌॥ 9 ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...