Tuesday, 24 February 2015

కనకశైల విహారిణి....

రచన: శ్రీ శ్యామశాస్త్రి
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:
కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే ॥కనక ॥

అను పల్లవి:
వనజభవహరినుతే దేవి
తుహినగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర
వనితే సతి మహాత్రిపుర సుందరి ॥ కనక ॥

చరణములు:
కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజగమనే మణిసదనే
శంబరవిదారి తోషిణి శివశంకరి
సదా మధుర భాషిణి॥ 1 ॥

చండ ముండఖండన పండితేక్షుదండ

 కోదండమండితపాణి
పుండరీక నయనార్చితపదే
త్రిపురవాసిని శివే హర విలాసిని॥ 2 ॥

శ్యామళాంబికే భవాబ్ధి తరణే
శ్యామకృష్ణపరిపాలిని జనని
కామితార్థఫలదాయికే
కామాక్షి సకలలోకసాక్షి॥ 3 ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...