రచన: శ్రీ భక్త రామదాసు
రాగం: కాపీ
తాళం: ఆది
ప: పావన రామ నామ సుధారస
పానము జేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు
చిత్తమునుంచే దెన్నటికో ॥ పావన రామ ॥
చరణములు:
దాసులగని సంతోషమ్మున తవ
దాసోహమ్మను టెన్నటికో
భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు
పురుషోత్తము గనుటెన్నటికో ॥ 1 ॥
చంచల గుణములు మాని సదా ని
శ్చలమతి నుండేదెన్నటికో
పంచ తత్వములు తారక నామము
పఠియించుట నా కెన్నటికో ॥ 2 ॥
ఇనవంశాంబుధి చంద్రుడు కృప ని
ష్టార్ధము లొసగే దెన్నటికో
కనకచేలు కరుణాలవాలుని
కన్నుల జూచే దెన్నటికో ॥ 3 ॥
వంచన లేకను భద్రాదీశుని
వర్ణన చేసేదెన్నటికో
అంచితముగ రామదాసుడ ననుకొని
ఆనందించే దెన్నటికో ॥ 4 ॥
No comments:
Post a Comment