Wednesday 17 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 8:


¤ ¤ ¤ శ్రీ నృసింహ సరస్వతి ¤ ¤ ¤

శ్రీపాద శ్రీవల్లభులు అంబికకు ఇచ్చిన వరం కారణంగా, అంబిక వచ్చే జన్మలో అంబా భవాని గా జన్మించింది. శ్రీ పాదుల వారు కూడా మరు జన్మలో శ్రీ నృసింహ సరస్వతిగా జన్మించారు.

మహారాష్ట్ర లోని వాషిం జిల్లాలోని కారంజ గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాధవ శర్మను అంబా భవాని పెండ్లాడింది. ఆ దంపతులకు 1378వ సంవత్సరంలో శ్రీనృసింహ సరస్వతి స్వామివారు జన్మించారు. ఈయనకు పూర్వాశ్రమ నామంగా తల్లిదండ్రులు నరహరి అని నామకరణం చేశారు.

నరహరికి ఐదేళ్ళ వయస్సు వచ్చినా మాటలు రాకపోవడంతో తల్లిదండ్రులు చాలా దుఃఖించారు. కొన్ని రోజుల తరువాత నరహరి సైగలతో తనకు ఉపనయన సంస్కారం చేస్తే మాటలు వస్తాయని చెప్పగా, మాధవ శర్మ అందుకు ఆనందించి నరహరికి ఉపనయన సంస్కారం చేస్తాడు. అన్నట్టుగానే ఉపనయనం అయిన తరువాత నరహరి సకల వేద శాస్త్రాలు వల్లించటం మొదలుపెట్టాడు. కొడుకు మాట్లాడడం చూసి మధవశర్మ దంపతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

ఎంతోమంది పండితులు,ఆచార్యులు నరహరి వద్ద వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. ప్రతీరోజూ ఎంతోమంది నరహరి వద్దకు వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకునేవారు.ఇలా నరహరి చాలా ప్రసిద్ధిచెందాడు. సన్యాసం స్వీకరించి లోకోద్ధరణక కంకణం కట్టుకున్న నరహరి 1386వ సంవత్సరంలో నరహరి తీర్థయాత్రలకై బయలుదేరాడు.

కొడుకు సన్యాసం తీసుకోబోతున్నాడని తెలిసిన అంబాభవాని కొడుకును వారించే ప్రయత్నం చేసింది. అప్పుడు నరహరి తన తల్లి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుచేసి తన నిజరూప దర్శనం చూపించగా, నరహరి సాక్షాత్తు శ్రీపాదుల వారి అవతారమని గుర్తించిన అంబాభవాని కొడుకును సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఆలా తీర్థయాత్రలకై బయలుదేరిన నరహరి బద్రీనాథ్ ధామానికి చేరుకున్నాడు, తరువాత అక్కడ నుండి కాశీకి చేరుకున్నాడు..... ( ఇంకావుంది)

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...