8-472- క.
ప్ర జలకు నెల్లను సముఁడవు
ప్ర జలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్రజలందు దుష్టమతులను
నిజ ముగ శిక్షింప వలదె నీ వు? మహాత్మా!
8-473- మ.
సు ర లన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శో కంబు
వారించి ని
ర్జర ధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శా సింప సత్కార్య మే
వెర వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ
చింతింపవే?
కరు ణాలోక సుధాఝరిం దనుపవే? క ళ్యాణ సంధాయకా! "
8-474- వ.
అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి
నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.
టీకా:
ప్రజలన్ = సంతానమునకు; ఎల్లను = అందరిపట్లను; సముడవు = సమానంగా చూచువాడవు; ప్రజలను = సంతానమును; కడుపారన్ = కడుపు నిండుగా; కన్న = పుట్టించినట్టి; బ్రహ్మవు = ప్రజాపతివి; అయ్యున్ = అగుటచేత; ప్రజల్ = పిల్లల; అందున్ = లో; దుష్ట = చెడు; మతులను = బుద్దులుగలవారిని; నిజముగన్ = తప్పక; శిక్షింపవలదె = శిక్షించవలెను కదా; నీవు = నీవు; మహాత్మా = గొప్పవాడా. సురలన్ = దేవతలను; సభ్యులన్ = మర్యాదస్తులను; ఆర్తులన్ = దుఃఖితులను; విరథులన్ = ఓడిపోయినవారిని; శోకంబున్ = దుఃఖమును; వారించి = పోగొట్టి; నిర్జరధాని = అమరావతియందు {నిర్జరధాని -దేవతలరాజధాని, అమరావతి}; నిలుపంగ = నిలబెట్టుటకు; రాత్రిచరులన్ = రాక్షసులను; శాసింపన్ = శిక్షించుట; సత్కార్యము = మంచిపని; ఈ = ఈలాగు; వెరవు = ఆవటము; ఏరీతిన్ = ఏవిధముగ; ఘటిల్లున్ = నెరవేరుతుందో; అట్టి = అటువంటి; క్రమమును = పద్దతిని; వేగంబ = శ్రీఘ్రమే; చింతింపవే = ఆలోచించుము; కరుణ = దయకల; ఆలోక = చూపులు యనెడి; సుధా = అమృతపు; ఝరిన్ = ప్రవాహమునందు; తనుపవే = ముంచెత్తుము; కల్యాణ = శుభములను;
సంధాయికా = కలిగించెడివాడ. అనినన్ = అనగా; మనోవల్లభ = భార్య {మనోవల్లభ - మనసునకు వల్లభ (నాయిక), సతి}; పలుకుల్ = మాటలు;
ఆకర్ణించి = విని; ముహూర్తమాత్రంబు = కొంచముసేపు; చింతించి = ఆలోచించి; విజ్ఞానదృష్టిన్ = దివ్యదృష్టిని; అవలంభించి = సారించి; భావి = రాబోవు; కాల = కాలము; కార్యంబున్ = సంగతులు; విచారించి = ఆలోచించి; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.
భావము:
మహాత్మా! కశ్యపా! బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి , నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా. మహానుభావా! సకల కల్యాణాలను సమకూర్చే వాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు. భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడమూ ,
రాక్షసులను శిక్షించడమూ చేయవలసిన మంచిపని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు. " ఇలా అంటున్న తన ప్రియ భార్య మాటలు విని , కశ్యపప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకుని ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=472
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment