8-470- క.
అ క్కా చెల్లెండ్రయ్యును
దక్క రు నాతోడి పోరుఁ; దా నున్ దితియున్
రక్కసులు సురల మొత్తఁగ
నక్క ట! వల దనదు చూచు నౌ నౌ ననుచున్.
8-471- సీ.
ఎం డకన్నెఱుగని యిం ద్రుని యిల్లాలు;
పలుపంచలను జాలిఁ బ డియె నేఁడు
త్రిభువన సామ్రాజ్య వి భవంబుఁ గోల్పోయి;
దేవేంద్రుఁ డడవులఁ ది రిఁగె నేఁడు
కలిమి గారాబు బి డ్డ లు జయంతాదులు;
శ బరార్భకుల వెంటఁ జ నిరి నేఁడు
నమరుల కాధార మగు నమరావతి;
య సురుల కాటపట్టయ్యె నేఁడు
8-471.1- ఆ.
బ లి జగముల నెల్ల బ లియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వా సవునకు
యా గభాగమెల్ల న తఁ డాహరించుచుఁ
గడఁగి సురల కొక్క క డియుఁ నీఁడు.
టీకా:
అక్కచెల్లెండ్రు = అక్కాచెల్లెళ్ళము; అయ్యున్ = అయినప్పటికిని; తక్కరు = వదలిపెట్టరు; నా = నా; తోడి = తోటి; పోరున్ = దెబ్బలాటలను; తానున్ = ఆమె; దితియున్ = దితికూడ; రక్కసులు = రాక్షుసులు; సురలన్ = దేవతలను; మొత్తగన్ = కొడుతుండగ; అక్కట = అయ్యో; వలదు = వద్దు; అనదు = అని చెప్పదు; చూచున్ = చూచుచుండును; ఔనౌను = భళీభళీ; అనుచున్ = అనుచు. ఎండకన్నెఱుగని = అతిసుకుమారియైన {ఎండకన్నెఱుగని - ఎండ (సూర్య కిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కలి సుకుమారమైన}; ఇంద్రుని = ఇంద్రుని యొక్క; ఇల్లాలు = భార్య; పలు = అనేకుల; పంచలను = చూర్లుయందు {పంచలు - పంచత్వములు, చావులు}; జాలిబడియె = దీనత్వమునపడెను; నేడు = ఇవాళ; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = మహారాజ్యాధికార; విభవంబున్ = వైభవమును; కోల్పోయి = నష్టపోయి; దేవేంద్రుడు = ఇంద్రుడు; అడవులన్ = అడవులమ్మట; తిరిగెన్ = తిరుగుచున్నాడు; నేడు = ఇవాళ; కలిమి = సంపదలకు; గారాబు = గారాల; బిడ్డలు = పిల్లలు; జయంత = జయంతుడు; ఆదులు = మున్నగువారు; శబర = బోయల; అర్భకుల = పిల్లల; వెంటన్ = తోకూడ; చనిరి = వెళ్ళుచున్నారు; నేడున్ = ఇవాళ; అమరుల్ = దేవతల; కున్ = కు; ఆధారము = నెలవైనది; అగు = అయిన; అమరావతి = అమరావతీపట్టణము; అసురుల్ = రాక్షసుల; కున్ = కు; ఆటపట్టు =
అలవాలము; అయ్యెన్ = అయినది; నేడు = ఇవాళ. బలి = బలి; జగములన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటియందు; బలియుచున్ = బలవంతుడు అగుచు; ఉన్నాడు = ఉన్నాడు; వానిన్ = అతనిని; గెలువరాదు = జయింప శక్యముకాదు; వాసవున్ = ఇంద్రున {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; కున్ = కు; యాగభాగము = హవిర్భాగములను; ఎల్లన్ = అంతటిని; అతడు = అతడే; ఆహరించుచున్ = దోచేసుకొనుచు; కడగి = పూని; సురల్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; కడియున్ = ముద్దకూడ; ఈడు = ఇవ్వడు.
భావము:
దితీ నేనూ అక్క చెల్లెళ్ళమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధపెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు.
ఎండకన్నెరగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదనూ పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారిబిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు అలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడు అవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేక పోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు ఒక్క కబళంకూడా దేవతలకు చిక్కనివ్వడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=470
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment