Wednesday, 28 November 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 59

10.1-545-వ.
కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండ సుకుమారంబైన శరీరముతోడ నేలఁ జాగిలంబడి మణిగణ సుప్రకాశంబు లైన తన కిరీటశిఖరప్రదేశంబు లా కుమారుని పాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజల పూరంబుల నతని యడుగులు గడిగి మఱియును.

భావము:
కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దభాలున క్రిందికి దూకాడు. బంగారు శలాకు వలె రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిలపడ్డాడు. ఎన్నోమణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగ మ్రొక్కేడు. ఆనందబాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని పాదాలు కడిగాడు. ఆపైన....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=545

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...