Friday, 31 January 2020

జయ భవాని శంకరాయ

రచన: శ్రీ ముద్దు బాలంభట్టు
గ్రంథం: మంథెన్న శ్రీ శివపురాణము

జయభవాని శంకరాయ చంద్రమౌళి యేకృతాంత
భయనివారణాయమాం పాహిమంగళం  ||జయ జయ||

అష్టమూర్తయే భుజంగ హారమకుటశోభితాయ
దుష్టదానవాంతకాయ సృష్టిమంగళం  ||జయ జయ||

పరమపురుష సారంగ పాణియేదిగంబరాయ
నిరతిశయానంతరూప నిత్యమంగళం  ||జయ జయ||

వామదేవాయపంచ వదనకమలశోభితాయ
సోమసూర్యాగ్ని నేత్ర సుపథ మంగళం ||జయ జయ||

విమలముని ప్రేరితాయ వేదవేదాంత వేద్య
కమలనాభ పూజితాయ రమణ మంగళం  ||జయ జయ||

భూతనాతమంత్రకూట పురమహాజనాశ్రితాయ
గౌతమీ తీరవాస కలయమంగళం  ||జయ జయ||

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...