రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: ఖరహరప్రియ
తాళం: ఆది
పల్లవి:
ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా దెల్పగ రాదా ॥ ప్రక్కల నిలబడి ॥
అనుపల్లవి:
చుక్కల రాయని గేరు మోము గల
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు ॥ ప్రక్కల నిలబడి ॥
చరణం:
తనువుచే వందన మొనరించుచున్నారా
చనవున నామకీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై మఱచి యున్నారా
ననరుంచి త్యాగరాజునితో హరి హరి వీరిరు ॥ ప్రక్కల నిలబడి ॥
No comments:
Post a Comment