Tuesday 17 March 2015

ఇందరికీ అభయంబులిచ్చు...

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
రాగం: కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ॥ ఇందరికీ ॥

చరణములు:
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కల్కియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ॥ 1 ॥

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొరసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ॥ 2 ॥

పురసతుల మానముల పొల్లజేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరు వేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ॥ 3 ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...