రచన: శ్యామశాస్త్రి
రాగం: భైరవి
తాళం: మిశ్ర చాపు
పల్లవి:
కామాక్షి అనుదినము మరవకనే నీ
పాదముల దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి॥
చరణములు:
కుందరదనా కువలయనయనా తల్లి రక్షించు
కంబుగళ నీరదచికురా విధువదనా మాయమ్మ॥ 1 ॥
కుంభకుచ మదమత్తగజగమ పద్మభవ హరి శంభు నుతపద
శంకరీ నీవు నా చింతల వేవేగ దీర్చమ్మా వినమ్మ॥ 2 ॥
భక్తజన కల్పలతికా కరుణాలయా సదయా గిరితనయ
కావవే శరణాగతుడుగద తామసము సేయక వరమొసగు॥ 3 ॥
పాతకములను దీర్చి నీ పద భక్తి సంతతమీయవే
పావనిగదా మొరవినదా పరాకేలనమ్మా వినమ్మ॥ 4 ॥
కలుషహారిణి సదా నతఫలదాయకి యని బిరుదు భువి
లో గలిగిన దొరయనుచు వేదము మొరలిడగ విని॥ 5 ॥
నీ పవన నిలయా సురసముదయా కరవిధృత కువలయా మద
దనుజ వారణమృగేంద్రార్చిత కలుషదమనఘనా అప
రిమితవైభవము గల నీ స్మరణ మదిలో దలచిన జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమియ్యవే॥ 6 ॥
శ్యామకృష్ణ సహోదరీ శివశంకరీ పరమేశ్వరి
హరిహరాదులకు నీ మహిమలు గణింప
తరమా సుతు డమ్మా అభిమానము లేదా నాపై
దేవీ పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి॥ 7 ॥
No comments:
Post a Comment