కీర్తన - దుడుకుగల నన్నే.
రాగం - గౌళ.
తాళం - ఆది.
పల్లవి:
దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా, ఎంతో..
అనుపల్లవి:
కడు దుర్విషయాకృష్టుడై ఘడియఘడియకు నిండారు
చరణాలు:
శ్రీవనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర ॥1॥
సకలభూతములయందు నీవైయుండగ మదిలేకపోయిన ॥2॥
చిరుతప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన ॥3॥
పరధనములకొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింపదిరిగినట్టి ॥4॥
తనమదిని భువిని సౌఖ్యపు జీవనమేయనుచు
సదా దినములు గడిపెడి ॥5॥
తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌటకుపదశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను ॥6॥
దృష్టికి సారంబగు లలనా సదనార్భకసేనామిత ధనాదులను దేవాధిదేవ నెరనమ్మితినిగాకను పదాబ్జభజనంబు మరచిన ॥7॥
చక్కని ముఖకమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచేదగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతతమపరాధినై చపలచిత్తుడైన ॥8॥
మానవతను దుర్లభమనుచునెంచి పరమానందమొందలేక మదమత్సరకామ లోభమోహములకు దాసుడై మోసబోతిగాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక నరాధములనురోయ సారహీనమతములను సాధింప తారుమారు ॥9॥
సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధనతతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి ॥10॥
No comments:
Post a Comment