Friday, 21 November 2014

శివ కేశవుల మధ్య లేని భేదం మనకెందుకు???

శివ,కేశవుల మధ్య భేదం లేదని పురాణాలు చెబుతున్నా, ఆధునిక సమాజంలో మనుషులు తమ ఆధిప త్యాన్ని నిలుపుకునేందుకు దేవుళ్ళ మధ్య విభేదాలను సృష్టిస్తుంటారు.దేవతలంతా ఒక్కటేనని వేదశాస్త్రాలు చెబుతున్నాయి, పండితులుచెబుతున్నారు.

అయినప్పటికీ, భక్తులు మాత్రం విభేదాలున్నాయని ఎలా నమ్ముతున్నారు.దీనికి కారణం మిడిమిడి జ్ఞానం కలిగిన వారేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. భోళా శంకరుడైన శివుణ్ణి ఎన్నో సార్లు ఆపదల నుంచి కాపాడినవాడు విష్ణుమూర్తే. భస్మాసురుని బారి నుంచి శివుణ్ణి రక్షించేందుకు విష్ణువు మోహినీ అవతారం ఎత్తిన కథను మనం చదువుకున్నాం. అలాగే, ఈశ్వరానుగ్రహం వల్ల శ్రీకృష్ణునికి సంతాన ప్రాప్తి కలిగింది.ఇందుకు సంబంధించిన పౌరాణిక గాథను సూతమహర్షి శౌనకాది మహామునులకు తెలియజేశాడు.

శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలన్న సంగతి మనకు తెలుసు. వారిలో ఏ ఒక్కరికీ సంతాన ప్రాప్తి కలగకపోవడంతొ ఓ రోజున వారంతా తమ పతి చెంతకువచ్చి స్త్రీలకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం లేకపోవడం పెద్ద వెలితే,పిల్లలు లేని స్త్రీని గొడ్ర్రాలు అని హేళన చేస్తారు. అష్టైశ్వర్యాలున్నా పిల్లలు లేని స్త్రీలు భాగ్యహీనులే.. వజ్ర వైఢూర్యాలూ, రత్నమాణి క్యాలు, సకల సంపదలు ఇవ్వలేని ఆనందాన్ని స్త్రీకి మాతృత్వం ఇస్తుందని పెద్దలు చెబుతారు. మా మనోవేదనను అర్ధంచేసుకుని పరిష్కారం కోసం ప్రయత్నించండి అని మొరపెట్టుకుంటారు.వారి ఆవేదనను అర్ధం చేసుకున్న శ్రీకృష్ణుడు హిమాలయాల్లో ఉపమన్యు మహర్షి ఆశ్రమా నికి చేరుకుని సంతాన ప్రాప్తి కోసం శివుని గురించి తపస్సు చేసేందు కు వచ్చానని చెబుతాడు. దాంతో ఆ మునీశ్వరుడు ఈ విషయాన్ని తనకు ముందే శివుడు చెప్పాడనీ, పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని కూడా చెప్పాడనీ,ఆ బాధ్యత నెరవేర్చేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానని తెలియజేస్తాడు. పరమాత్మస్వరూపుడవైన నీకు మంత్రోపదేశం చేసే మహాద్భాగ్యం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ శ్వరానుగ్రహం వల్లే నాకు ఈ భాగ్యం దక్కింది. ధర్మ సంస్థాపనాచార్యుడవైన నీవు నన్ను గురువుగా సంభావించడం ఎన్నో యుగాల పుణ్యఫలంగా భావిస్తున్నాను. అని స్తుతించి ఉపమన్య మహార్షి శ్రీకృష్ణునికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీకృష్ణడు హిమవత్పర్వతంపై నియమనిష్టలతోఘోర తపస్సు చేయగా,శివడు ప్రత్యక్ష మయ్యాడు. శ్రీకృష్ణా ఏ కోరిక నిమిత్తం నీవు ఇంత ఘోరమైన తపస్సుచేస్తున్నావని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణడు తన మనసులోని మాటను చంద్రమౌళీశ్వరునికి తెలిపాడు., దాంతో శివుడు ప్రసన్నుడై కృష్ణా నీ ఎనమండుగురు భార్యలే కాక, పదనారు వేల మంది భామినుల కూడా సంతానవతులు అవుతారని ఆశీర్వదించాడు.

నీ సంతానంలో జాంబవతీ నందనుడు అయిన సాంబుడు మంచి పేరు ప్రఖ్యాతులను సంపా దించుకుంటాడు నిత్య యవ్వనుడవైన నీవు నా మాదిరిగానే విశ్వ మానవ కోటి చే నిరం తరం కీర్తించబడతావు అని ఆశీర్వదిస్తాడు. ఈ వృత్తాంతం వల్ల శివకేశవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవనీ, అవన్నీ మనం సృష్టించుకున్నవేనని రుజువు అవుతోంది. అంతేకాక, కార్తీక మాసంలో శివుణ్ణి ప్రతి రోజూ అభిషేకాలతో సేవించినట్టే, క్షీరాబ్ది ద్వాదశినాడు శ్రీకృష్ణుణ్‌ి పూజిస్తూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టిస్థితి లయకారులుగా త్రిమూర్తులుగా ప్రసి ద్ధులు. వారి మధ్య ఎంతో సామరస్యం ఉండగా,మనమెందుకు కీచులాడుకోవడం....???

(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి సేకరించబడినది....)

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...