శ్రీ వేణీమాధవ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట...
ఇక్కడి వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము" లో ఈ వేణీ మాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... ఇంకా ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు ఈ వేణీమాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నాన ఫలం పొందరని కూడా తన రామచరితమానసంలో చెప్పాడు తులసీదాసు..
తమ వనవాసంలో సీతారామలక్ష్మణులు ఈ ఆలయాన్ని దర్శించినట్టు చెప్పబడి వుంది...శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ప్రయాగ వచ్చినప్పుడు ఇక్కడ కొంత కాలం గడిపారు..ఈ ఆలయంలోని రాధాకృష్ణుల మూర్తుల చాలా అందంగా ఉంటాయి.. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు..త్రివేణీ సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది....
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గల కుంతీమాధవ ఆలయాన్ని దర్శిద్దాం...
No comments:
Post a Comment