రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య.
రాగం: బౌలి
తాళం: ఆది
పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాద
శ్రీమన్నారాయణ మే శరణు ॥ శ్రీమన్నా॥
చరణములు:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు ॥ 1 ॥
పరమయోగిజన భాగధేయ శ్రీ
పరమపురుష పరాత్పరా
పరమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరి దేవ శరణు ॥ 2 ॥
No comments:
Post a Comment