ఆదిశంకర జయంతి: (వైశాఖ శుద్ధ పంచమి; 23-04-2015)
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ।
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం॥
భావం:
వేద వేదాంత పురాణజ్ఞానమునకు ఆలయమైన వాడు, కరుణామూర్తి, లోకమునకు శుభము చేకూర్చువాడు, భగవంతుని పాదముల యొక్క రూపమైనవాడు అగు శంకరులకు నమస్కరిస్తాను.
ఈ రోజు వైశాఖ శుక్ల పంచమి పర్వదినం. ఆది
శంకరుల పవిత్ర జన్మ దినం. సనాతన వేద ధర్మం దాదాపు డెభ్బై రెండు శాఖలుగా విడిపోయి, గందరగోళంలో మునిగి, విపరీత వాదనలు మరియు విపరీత చేష్టలతో కునారిల్లుతూ, మహత్తరమైన వేదజ్ఞానాన్ని మరిచి ఎవరికి తోచిన సిద్ధాంతాలు వారు అనుసరిస్తూ, ఇదే సరియైన మతం అని భావిస్తూ భారతదేశమంతా రకరకాలైన మతాలతో నిండి, సత్యం మరుగున పడి, వేదధర్మం కొడిగట్టిన సమయంలో, పదహారేళ్ళు శ్రమించి ఒక్క చేతితో ఆ పరిస్థితినంతా చక్కదిద్ది, భారతదేశాన్నంతా ఒక్కత్రాటిపైన నిలిపి, వేదానికి ఉపనిషత్తులకు అసలైన భాష్యం చెప్పి, తన జీవితాన్ని ధర్మ రక్షణకు ధారపోసి, ఘోర తమస్సులో నిద్రిస్తున్న భారతజాతికి వెలుగు బాటతో దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు ఆది శంకరులు జన్మించిన మహత్తరమైన రోజు ఇది.
అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు....
No comments:
Post a Comment