¤ ¤ ¤ శ్రీపాద శ్రీ వల్లభులు ¤ ¤ ¤
పిఠాపురం గ్రామంలో పుణ్యదంపతులైన శ్రీ అప్పలరాజ శర్మ మరియు శ్రీ సుమతీల మూడవ సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు 1320వ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జన్మించారు.
ఒకనాడు అప్పలరాజ శర్మ గారు తన ఇంట శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుండగా మధ్యాహ్న వేళ ఒక సాధువు భిక్షకై విచ్చేసాడు. శ్రాద్ధ కర్మ చేసే సమయంలో భిక్ష వేయడం నిషేధం... అయినా అప్పలరాజ శర్మ వచ్చిన సాధువును నారాయణ రూపంగా భావించి, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం తప్పుకాదనేది వేదవాక్కు ఆయనకు భిక్ష వేసి సంతృప్తి పరిచాడు.
అంతే చాలా సంతోషించిన దత్తాత్రేయుడు సాధువు రూపాన్ని వదిలి తన నిజ రూపాన్ని ధరించాడు. అప్పలరాజ శర్మ దంపతులను దీవించిన దత్తాత్రేయుడు వారిని ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పలరాజ శర్మ దంపతులు " నీ వంటి ఙ్ఞాన పురుషుడు మాకు కొడుకుగా రావాలి" అని దత్తత్రేయుని కోరారు.
"నా అంశతో, అందరికీ గురుతుల్యుడై, తేజో ప్రకాశాలతో వెలగే కుమారుడు మీకు కలుగు గాక " అని వారీని దీవించి దత్తాత్రేయుడు అంతర్ధానమయ్యాడు. అప్పటికే అప్పలరాజ శర్మ దంపతులకు ఎంతో మంది సంతానం కలుగగా వారిలో చాలా మంది మరణించారు. అందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగలగా వారిలో కూడా ఒకరు గుడ్డివాడు కాగా, మరొకడు కుంటివాడు. అలా సంవత్సరం తరువాత సుమతికి తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు.
ఆ పిల్లవాడికి 'శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు అప్పలరాజ శర్మ దంపతులు. ఎందుకంటే ఆ బాలుడు తన పాదములపైన విచిత్ర చిహ్నాలతో జన్మించాడు కాబట్టి. ఆ బాలుడు తన ఏడు సంవత్సరాల లోపే సకల విద్యలూ నేర్చుకోగా, తన ఉపనయన కార్యక్రమం తరువాత వాటిపైన ప్రవచనములు ఇవ్వసాగాడు. తన పదహారవ ఏటకు చేరుకున్నాడు శ్రీ పాదుడికి పెళ్ళి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ....
( ఇంకా వుంది )
No comments:
Post a Comment