Sunday, 2 August 2015

శ్రీ జగన్నాథ వైభవం - 6:



శ్రీ పీఠంగా పిలిచే పూరీఆలయం 214 అడుగుల ఎతైన గోపురంతో, 68 అనుబంధ ఆలయాలతో భక్తజనులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ కొలువు దీరిన బలభద్ర, సుభద్ర, జగన్నాథులను సృష్టి = బ్రహ్మ, స్థితి = విష్ణు, లయ = మహేశ్వరులకు ప్రతీకగానూ భావిస్తారు.రుద్ర, విష్ణు, ఆదిపరాశక్తి రూపాలుగానూ భావిస్తుంటారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం పురోగమనమే తప్ప తిరోగమించదు. రథోత్సవ ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 బిందెలతో దేవతామూర్తులకు స్నానం చేయిస్తారు ఈ 'సుదీర్ఘ' స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారినపడి, తిరిగి కోలుకునే వరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. 

56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో 'పథ్యం'గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్లీఆలయ ప్రవేశంతో 'నేత్రోత్సవం' జరిపి, యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేబర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. అంటే ఈ సంవత్సరం నవకలేబర ఉత్సవం జరగబోతుంది అన్నమాట.

ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. 

అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం పాత మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు.... ( సమాప్తం )

జై జగన్నాథ.... జై జై జగన్నాథ....




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...