Saturday, 29 August 2015

రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి :

‘రక్ష' అంటే రక్షించటమని, ‘బంధన్' అంటే బంధం కలిగి ఉండటంగా చెపుతారు. రెండిటిని కలిపి రక్షాబంధన్ గా చెపుతారు. రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని
రంగాల్లోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. రాఖీ పండుగ ప్రాధాన్యతను పరిశీలిస్తే

బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి
తన రాజ్యరక్షణాభారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండి పోవలసి వస్తుంది.అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన
కోరిక మేరకు విష్ణువును విడుదల చేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.

శ్రీ కృష్ణుడుకి శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో క్రిష్ణుడు తన చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతూంటే, అక్కడే ఉన్నద్రౌపతి తన చీర కొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి
ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు.

శ్రీ హయగ్రీవ జయంతి:

శ్రావణ శుద్ధ పౌర్ణమి ... 'హయగ్రీవ జయంతి'గా కూడా చెప్పబడుతోంది. గుర్రం శిరస్సు భాగాన్ని కలిగివాడిగా కనిపించే ఈ దేవతామూర్తి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటిగా చెప్పబడుతోంది. హిరణ్య కశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి అవతారమెత్తిన నారాయణుడు, ఇక్కడ కూడా అసురసంహారం కోసమే హయగ్రీవుడుగా అవతరించాడు. హయము అంటే గుర్రం అని మరియు గ్రీవము అంటే కంఠము అని అర్థం.

పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు, తన రూపంలోవున్నవారి చేతిలోనే తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో అటు దేవతలను ... ఇటు సాధు సత్పురుషులను నానారకాలుగా హింసించడమే కాకుండా వేదాలను సైతం దొంగిలిస్తాడు. దాంతో దేవతలంతా కలిసి వైకుంఠానికి చేరుకొని, అక్కడే హయగ్రీవోత్పత్తి జరిగేలా చేస్తారు.గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది.

అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షల.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...