రచన: శ్రీ త్యాగరాజ స్వామి.
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది
పల్లవి:
రామ రామ గోవింద నను
రక్షించు ముకుంద ॥ ॥
చరణములు:
కలి యుగ మనుజులు నీకు మహాత్మ్యము
కలదు లేదనే కాలమాయెగా ॥ రామ ॥
కాముని దాసులు నా పలుకుల విని
కావలసినటులనాడనాయె కదా ॥ రామ ॥
పామరులను కని సిగ్గు పడుచు మరి
మోము మరుగు జేసి తిరుగనాయెను ॥ రామ ॥
క్రొవ్వు గల నరుల కొనియాడగ చిరు
నవ్వులతో నను జూడనాయె కదా ॥ రామ ॥
మతి హీనులు శ్రీ పతి దాసులకీ
గతి రారాదని పల్కనాయె కదా ॥ రామ ॥
నమ్మినాడనే పేరుకైన నీ
తమ్మునితోనైన పల్కవైతివి ॥ రామ ॥
కార్యాకార్యము సమమాయెను నీ
శౌర్యమెందు దాచుకొంటివయ్యో ॥ రామ ॥
రాక రాక బ్రతుకిట్లాయెను శ్రీ
త్యాగరాజ నుత తరుణము కాదు ॥ రామ ॥
No comments:
Post a Comment