Sunday, 30 June 2019

కపిల దేవహూతి సంవాదం - 51


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-938-క.
గురు ఘోరరూపకంబై
పరఁగెడు తాపత్రయం బుపశమింపఁగ శ్రీ
హరిచేత నిసృష్టము లగు
కరుణాలోకములఁ దలఁపఁగాఁదగు బుద్ధిన్.
3-939-క.
ఘనరుచిగల మందస్మిత
మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్
మునుకొని ధ్యానముసేయం
జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ!

భావము:
1) ఆదిభౌతికము, 2) ఆధ్యాత్మికము, 3) ఆదిదైవికము అనెడి కారణములు కలిగిన మూడు బాధలు (తాపములు) తాపత్రయం అనబడతాయి, భయంకరాతి భయంకరములు అయిన ఆ తాపత్రయాలను ఉపశమింప చేయగలిగిన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షవీక్షణాలను మనస్సునందు స్మరించుకోవాలి. సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లీ! భక్తియోగాన్ని అవలంబించినవారు కమనీయకాంతులు ప్రసరించే విష్ణువుయొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=939

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...