Monday, 6 September 2021
శ్రీకృష్ణ విజయము - ౩౩౦(330)
( ధర్మజు రాజసూయారంభంబు )
10.2-676-క.
అసమాస్త్రుఁడు పులు గడిగిన
కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్
మిసమిస మెఱవఁగ వేశ్యా
విసరము దాసీజనంబు విభవ మెలర్పన్.
10.2-677-ఆ.
హరుల వేసడములఁ గరులను నెక్కి తో
నరుగుదేర బహువిధాయుధములు
దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు
రాంగనలు సితాంబుజాక్షు కడకు.
10.2-678-వ.
వచ్చి రంత.
10.2-679-క.
నారదుని మాధవుఁడు స
త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును
వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్.
భావము:
పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా తోడు వస్తుండగా ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=679
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
Subscribe to:
Post Comments (Atom)
శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)
( శ్రీకృష్ణ నిర్యాణంబు) 11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...
-
రచన: శ్రీ ముద్దు బాలంభట్టు గ్రంథం: మంథెన్న శ్రీ శివపురాణము జయభవాని శంకరాయ చంద్రమౌళి యేకృతాంత భయనివారణాయమాం పాహిమంగళం ||జయ జయ|| అష్టమూర్తయే ...
-
"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ'' అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్య...
-
( కాళింది మిత్రవిందల పెండ్లి ) 10.2-124-వ. అంతం గృష్ణుండు ధర్మరాజప్రముఖుల వీడుకొని, సాత్యకిప్రముఖ సహచరులు గొలువ, మరలి తనపురంబునక...
No comments:
Post a Comment