రచన: త్యాగరాజు స్వామి
రాగం: మధ్యమావతి
తాళం: ఆది
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార జూతాము రారే
అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు
చరణాలు:
చిల్లర వేల్పుల రీతి నరుల కర
పల్లవములను తళుక్కనుచు బిరుదు-
లెల్ల మెరయ నిజ భక్తులు పొగడగ
ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో
మల్లె హారములు మరి శోభిల్లగ
చల్లని వేళ సకల నవ-రత్నపు
పల్లకిలో వేంచేసి వచ్చు - 1
హితమైన సకల నైవేద్యంబుల
సమ్మతమున అడుగడుగుకారగింపుచు
మితము లేని ఉపచారములతో-
నతి సంతోషమున సతతము
జప తపములనొనరించు
నత జనులకభీష్టములవ్వారిగ
వెతగియొసగుదుననుచు పంచ నదీ
పతి వెడలి సొగసు మీరగ వచ్చు - 2
భాగవతులు హరి నామ కీర్తనము
బాగుగ సుస్వరములతో వింత
రాగములనాలాపము సేయు
వైభోగములను జూచి
నాగ భూషణుడు కరుణా నిధియై
వేగము సకల సు-జన రక్షణమున
జాగ-రూకుడై కోర్కెలనొసగు
త్యాగరాజు తాననుచును వచ్చు - 3
No comments:
Post a Comment