Tuesday 30 September 2014

శ్రీ కాత్యాయినీ దేవి....

కాత్యాయినీ: (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి)

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని.
పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వ విఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది. ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రను, మరొకటి వరదముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి.ఈమె సింహవాహని. ఆ దినానసాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది.

ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు.ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసన యందూ తత్పరులము కావాలి.

Monday 29 September 2014

శ్రీ స్కందమాత

స్కందమాత: (ఆశ్వీయుజ శుద్ధ పంచమి)

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కంద భగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ రూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యు లోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై
మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది.

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో
స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక చేతిలో కమలమును కలిగి ఉంటుంది. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక 'పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహని.

స్కందమాత నమోస్తుతే!!!

Sunday 28 September 2014

శ్రీ కూష్మాండ మాత...

కూష్మాండ: (ఆశ్వీయుజ శుద్ధ చవితి)

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే ॥

దుర్గామాత యొక్క నాల్గవ అవతారం కూష్మాండ, అంటే సంస్కృతంలో గుమ్మడికాయ అని అర్థం. చిరునవ్వుతో సులువుగా బ్రహ్మాండమును సృజించునది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ సృష్టికి ముందు అంతా గాఢాంధకారం వ్యాపించి ఉండేది. అప్పుడీ దేవి కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈమె శరీరం సూర్యుడితో సమమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఈమే సృష్టికి ఆది శక్తి, సూర్యమండలంలో నివశింపగల విశేషమైన శక్తి సామర్థ్యాలు ఈమెకు ఉన్నాయి. కూష్మాండదేవీ సింహ వాహనురాలు. ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది కాబట్టి అష్టభుజాదేవి అనే పేరు కూడా ఉంది. ఏడు చేతుల్లో కమండలము, బాణము, ధనస్సు, కమలం, అమృత కలశం, చక్రం, గద, ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే అద్భుతమైన జపమాల ధరించి ఉంటుంది.

కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు. శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని
ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది.

మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది.

Saturday 27 September 2014

శ్రీ చంద్రఘంటా దేవీ

చంద్రఘంట: (ఆశ్వీయుజ శుద్ధ తృతీయ)

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాత మూడో శక్తి అవతారం. ఈమె తన శిరస్సున దాల్చిన అర్థచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వలన చంద్రఘంట
అనే పేరు వచ్చింది. శరీర కాంతి బంగారం మాదిరి మిలమిలలాడుతుండగా తన పది చేతులలో ఖడ్గము మొదలయినటువంటి శస్త్రాలు, బాణం తదితర అస్త్రాలు ధరించి ఉంటుంది. సింహంపై కూర్చుని యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉంటుంది. చంద్రఘంట గంట నుంచి వెలువడే శబ్ద తరంగాలు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే
మాదిరి ఉంటాయి. చంద్రఘంట మాత కటాక్షం వల్ల భక్తులు, ఉపాసకుల బాధలు, పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. దర్శన
మాత్రం చేత ఒక అలౌకికమయిన ప్రశాంతత చేకూరుతుంది.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే
వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె
నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై
ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ
సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె
ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే
శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది... చంద్రఘంట నమోస్తుతే!!!

Friday 26 September 2014

శ్రీ బ్రహ్మచారిణీ దేవి...

బ్రహ్మచారిణీ దేవి: (ఆశ్వీయుజ శుద్ధ విదియ)

దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

ఆ శక్తిస్వరూపిణి యొక్క  నవశక్తుల్లో రెండవ
స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అనగా తపమాచరించే తల్లి అని అర్థం. బ్రహ్మము నందు చరించునది కాబట్టి బ్రహ్మచారిణీ మాత.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలమును ధరించే మాత పరమేశ్వరుని పతిగా పొందటానికి  తీవ్రమైన తపమొనర్చి 'ఉమ' అని ప్రసిద్ధి వహించింది.

ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. అత్యంత శుభంకరము. భక్తులకు, సిద్ధులకు అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవల్ల ఉపాసకులకు నిశ్చలమైన దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తిస్తుంది. ఈమెను ఉపాసించిన వారికి తపో,త్యాగ, వైరాగ్య సదాచరములు వృద్ధిచెందుతాయి. జీవన సంఘర్షణలోనూ వారు కర్తవ్యమును మరవరు. బ్రహ్మచారిణీ దేవి కృపవలన వారికి సర్వత్ర విజయము లభింస్తుంది.

ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె
యందు భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

Thursday 25 September 2014

శ్రీ శైలపుత్రీ దేవి...

శైలపుత్రి: (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)

వందే వాంఛిత చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం| శూలధరాం శైలపుత్రీం యశస్వినీం||

నవరాత్రి పర్వదినములలో మొదటిరోజున దేవి శైలపుత్రి నామంతో పిలువబడుతుంది. వృషభవాహనమును అధిరోహించి,ఒక చేతన త్రిశూలము, మరోచేత కమలము ధరించి,చంద్రవంక శిరస్సున దాల్చిన దేవి భక్తులను తరింపజేస్తుంది.

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై జన్మంచినందు వల్ల ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. పార్వతి, హైమవతి అనేవి ఈమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతాలు.
వాంఛితములను ప్రసాదించు తల్లి ఈ శైలపుత్రీ.

సత్వ రజస్తమోగుణాల ప్రకృతే ఆదిశక్తి. ఆ ఆదిశక్తియే పార్వతీదేవి.ఋగ్వేదం దృష్ట్యా అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే మహా మహి
మాన్వితమైన శక్తి దేవీశక్తి. విశ్వచైతన్య శక్తియైన అమ్మవారు హిమవత్పుత్రీకగా జన్మించి, అపర్ణగా ఎదిగి సకలశక్తి సమన్వితగా, ధర్మార్ధకామ మోక్ష ప్రదాయినిగా శైలపుత్రీదేవి శోభిల్లుతుంది. ఈ ప్రథమ దివస ఉపాసనలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండే అతని యోగసాధన ప్రారంభమవుతుంది.

శైలపుత్రీం నమోస్తుతే!!!

Wednesday 24 September 2014

దేవీ శరన్నవరాత్రులు

శ్రీ దేవీ శరన్నవరాత్రులు:

రేపటి నుండే శ్రీ దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి..(25-9-2014 నుండి 4-10-2014 వరకు)

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన
దేవీకవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది.అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

మొదటి రోజు శ్రీ శైలపుత్రీ దేవి
రెండవనాడు శ్రీ బ్రహ్మచారిణీ దేవి
మూడవనాడు శ్రీ చంద్రఘంటా దేవి
నాల్గవనాడు శ్రీ కూష్మాండ దేవి
ఐదవనాడు శ్రీ స్కందమాత
ఆరవనాడు శ్రీ కాత్యాయినీ దేవీ
ఏడవనాడు శ్రీ కాళ రాత్రి దేవి
ఎనిమిదవ నాడు శ్రీ మహాగౌరీ దేవి
తొమ్మిదవనాడు శ్రీ సిద్ధిధాత్రీ దేవి.


Tuesday 9 September 2014

జయ జయహే భగవతీ.....

పల్లవి:
జయ జయహే భగవతి సురభారతీ
తవ చరణౌ ప్రణమామహ    ||జయ జయ||

అనుపల్లవి:
నాద బ్రహ్మమయి జయ వాగీశ్వరీ
శరణం తే గచ్ఛామహ     ||జయ జయ||

చరణం - 1:
త్వమసి శరణ్య త్రభువన ధన్యా,
సురముని నందిత చరణ
నవరస మధురా కవితా ముఖరే,
స్మిత రుచి రుచిరా భరణ     ||జయ జయ||

చరణం - 2:
ఆసినా భవ మానస హంసే,
కుంద తుహిన శశి ధవళే
హర జగతాంకురు భోధి వికాసం,
స్తిత పంకజ తను విమలే    ||జయ జయ||

చరణం - 3:
లలితా కళామయి జ్ఞాన విభామయి
వీణా పుస్తక ధారిణి
మథిర స్తామ్నో తవ పద కమలే
అయి కుంట విష  హారిణి    ||జయ జయ||

Saturday 6 September 2014

వామన జయంతి

ఆ పరమాత్మ వామనావతారం ధరించిన రోజే భాద్ర పద శుద్ధద్వాదశి రోజు.ఈ రోజు శ్రవణానక్షత్రం కలిసివస్తే మరింత మంచిది. భగవంతుడు 'ఇందుగలడందు లేడని...' నిర్ద్వంద్వంగా చాటడమే కాదు తండ్రికి స్వయంగా స్తంభంలో చూపించిన పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. అతడెంత దయాగుణం, దాతృగుణం కలవాడైనప్పటికీ అహంకార పూరితుడు కాబట్టే అతడిని సంహరించాల్సి వచ్చింది. అందుకోసం పరమాత్మ ధరించిన అవతారమే వామనావతారం. ఇందులోనూ ఒక పరమార్థం ఉంది.

ఆయన తనకు నచ్చిన భక్తులకు ఏదైనా   ఇవ్వాలనుకుంటే ముందుగా భక్తుని సర్వస్వాన్నీ తన స్వంతం చేసుకుంటాడట. బలిచక్రవర్తికి ఆయన ఎన్నో ఇవ్వాలనుకున్నాడు. కాబట్టే బలివద్ద పూచికపుల్ల కూడా లేకుండా దానమడిగి తన కైవశం చేసుకున్నాడు. ఆ తరువాతే ఆయనకు ఎన్నో వరాలిచ్చాడు. బలి ఎన్నో యజ్ఞయాగాలు చేసిన మహాభక్తుడు. అడిగిన వారికి లేదనకుండా దానం చెయ్యగల మహా దాత. బలి నూరో యజ్ఞం చేస్తున్న సందర్భంగా మహా విష్ణువు చిన్నవటుని రూపంలో వచ్చి బలిని మూడడుగుల నేలదానం అడుగుతాడు. రాక్షస గురువైన శుక్రచార్యుడు వచ్చింది శ్రీమహావిష్ణువని, దానం ఈయవద్దని ఎంత వారిస్తున్నా అంతటి మహానుభావుని చేయి కింద, నాచేయి పైన ఉండడం కంటే నాకేం కావాలంటూ ఇచ్చేస్తాడు బలి. అంతే! అంత చిన్న వటుడూ నేలానింగీ అక్రమించి మూడోఅడుగుకోసం స్థలం చూపించమంటాడు. వామనుడలా ఎదుగుతున్నప్పుడు నింగిలోని సూర్య బింబం ఒక్కో దశలో స్వామికి ఒక్కో ఆభరణంగా మారి పోయిందంటూ ఆ రూపాన్ని పోతన్న మహాద్భుతంగా వర్ణిస్తాడు. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన బలి మూడో అడుగును శిరస్సుపై పెట్టమని స్థలాన్ని చూపిస్తాడు. పరమాత్మ మూడో పాదంతో బలిని సుతల లోకంలోకి అణచివేస్తాడు.

అయినా బలి సత్యసంధతకు మెచ్చి ఆ లోకంలో తానే స్వయంగా బలికి కాపలాగా ఉండడమే కాదు, సావర్ణి మనువు కాలంలో ఇంద్రపదవిని వరంగా ఇచ్చాడు మహావిష్ణువు. అంతటి పవిత్రమైనదీ రోజు. ఈరోజున

శ్లో|| దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతి కారిణః |
      ప్రభవే సర్వదేవానాం వామనాయ నమోనమః ||

అంటూ యధాశక్తి వామనుణ్ని పూజించాలి. ఈ ద్వాదశినాడు ఉపవాసుంటే ఏకాదశి ఉపవాస పుణ్యం కూడా కలిసివస్తుందట.

శ్లో|| నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే|
      తుభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాలవామన రూపిణ |
      నమశ్శాజ్గ ధనుర్భాణ పాణయే వామనాయ చ|
      యజ్ఞభుక్ ఫలద్రాత్ చవామనాయ నమోనమః|| ''

అంటూ అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఈరోజు బ్రాహ్మణులకు పెరుగు దానం చేస్తే మంచిదంటారు.

Monday 1 September 2014

Swami Vivekananda

Once a british asked Swami Vivekanand...

"Why can't you wear proper clothes to look like a gentleman???

Swami Vivekanand smiled & said: In your culture, a tailor makes a gentleman; but, in our culture,character makes  gentleman.

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...