రచన: శ్రీ త్యాగరాజు.
రాగం: లలిత
తాళం: రూపకం
పల్లవి:
సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి ॥ సీతమ్మ ॥
అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రి, వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు, ఓ మనస! ॥ సీతమ్మ ॥
చరణము:
పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస! ॥ సీతమ్మ ॥
No comments:
Post a Comment