రచన: శ్రీ అన్నమాచార్యులు.
రాగం: పాడి
తాళం: ఆది
పల్లవి:
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామ ॥ అంతయు ॥
చరణములు:
కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ ॥ 1 ॥
తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా ॥ 2 ॥
పుట్టుగు నీవే పురుషోత్తమ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే ॥ 3 ॥
No comments:
Post a Comment