Wednesday, 3 June 2015

శ్రీ దత్తాత్రేయ వభవం - 7:


శ్రీపాదులవారు ముప్ఫై సంవత్సరాల తన అవతార జీవితంలో ఎన్నో లీలలను చూపారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించిన దివ్య సంఘటనలు కోకొల్లలు.ఇవన్నీ మనకు స్వామి వారి జీవిత చరిత్ర అయిన 'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం'లో కనిపిస్తాయి.

శ్రీపాదుల వారి జన్మించిన పిఠాపురంలో స్వామి వారి జీవిత చరిత్ర అయిన 'శ్రీపాద వల్లభ చరితామృతం' లో చెప్పబడిన విధంగా శ్రీపాద శ్రీవల్లభ మహా #సంస్థానం వారు ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. అలాగే శ్రీపాదులవారు తమ అవతార జీవితంలో ఎక్కువ కాలం గడిపిన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని కురవాపురంలో కూడా కృష్ణా నది ఒడ్డున ఒక దివ్యమైన ఆలయం ఉన్నది.

'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం' పేరిట స్వామివారి జీవితచరిత్ర తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ మరియు ఆంగ్ల భాషల్లో లభ్యమవుతున్నది. ఇది నిత్యపారాయణ గ్రంథం
మరియు ఈ దత్తక్షేత్రాలు ఎప్పుడూ ' దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర' అంటూ మారుమోగుతూ  ఉంటాయి.

రేపటి నుండి శ్రీ దత్తాత్రేయుని #రెండవ అవతారమైన 'శ్రీ నృసింహ సరస్వతి' స్వామి వారి గురించి తెలుసుకుందాం...... దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.... జై గురు దత్త..... జై శ్రీ రామ.... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...