Wednesday, 10 June 2015

వినుడిదె రఘుపతి విజయములు

రచన: తాళ్ళపాక అన్నమాచార్యులు.
రాగం: శంకరాభరణం
తాళం: ఆది

పల్లవి:
వినుడిదె రఘుపతి విజయములు
పనుపడి రాక్ష బాధలుడిగెను ॥వినుడిదె॥

చరణములు:
కులగిరులదరెను కుంభినివడకెను
ఇల రాముడు రథమెక్కినను
కలగె వారిధులు కంపించె జగములు
బలు విలునమ్ములు పట్టినను ॥ 1 ॥

పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె
తొడిబడ బాణము దొడిగినను
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు
యెడవక రావణునేసినను ॥ 2 ॥

చుక్కలు దుల్లెను స్రుక్కె భూతములు
తొక్కి యసురతల దుంచినను
గక్కున శ్రీ వేంకటగిరి నిలువగ
అక్కజమగు శుభమందరి కొదవె ॥ 3 ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...