Saturday, 1 October 2016

శ్రీ శైలపుత్రీ దేవి...

(ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)
(01-10-2016 నుండి 02-10-2016)

వందే వాంఛిత చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం| శూలధరాం శైలపుత్రీం యశస్వినీం||

నవరాత్రి పర్వదినములలో మొదటిరోజున దేవి శైలపుత్రి నామంతో పిలువబడుతుంది. వృషభవాహనమును అధిరోహించి,ఒక చేతన త్రిశూలము, మరోచేత కమలము ధరించి,చంద్రవంక శిరస్సున దాల్చిన దేవి భక్తులను తరింపజేస్తుంది.

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై జన్మంచినందు వల్ల ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. పార్వతి, హైమవతి అనేవి ఈమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతాలు. వాంఛితములను ప్రసాదించు తల్లి ఈ శైలపుత్రీ.

సత్వ రజస్తమోగుణాల ప్రకృతే ఆదిశక్తి. ఆ ఆదిశక్తియే పార్వతీదేవి. ఋగ్వేదం దృష్ట్యా అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే మహా మహిమాన్వితమైన శక్తి దేవీశక్తి. విశ్వచైతన్య శక్తియైన అమ్మవారు హిమవత్పుత్రీకగా జన్మించి, అపర్ణగా ఎదిగి సకలశక్తి సమన్వితగా, ధర్మార్ధకామ మోక్ష ప్రదాయినిగా శైలపుత్రీదేవి శోభిల్లుతుంది. ఈ ప్రథమ దివస ఉపాసనలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండే అతని యోగసాధన ప్రారంభమవుతుంది.

శైలపుత్రీం నమోస్తుతే!!!

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...