Wednesday 21 November 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 52

10.1-532-వ.
అని యిట్లు సకలంబును సుకరంబుగ నెఱింగెడి నెఱవాది ముదుక యెఱుకగలప్రోడ వెఱంగుపడి గ్రద్దనఁ బెద్దప్రొద్దు తద్దయుం దలపోసి కర్జంబు మందల యెఱుంగక కొందలపడుచు నాందోళనంబున.
10.1-533-క.
మోహము లేక జగంబుల
మోహింపఁగఁ జేయ నేర్చి మొనసిన విష్ణున్
మోహింపించెద ననియెడు
మోహమున విధాత తాన మోహితుఁ డయ్యెన్.

భావము:
ఇలా ఈ గొల్లపిల్లలు దూడలు గురించి అలోచించుకుంటూ, సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరి అయిన అ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలోతాను అలోచించుకున్నా ఏం చేయాలో తెలియ లేదు. బిక్కమొగం వేసి, ఆందోళన పడసాగాడు. శ్రీహరి మోహం అంటని వాడు. కానీ తాను సర్వ జగత్తులను మోహింపచేయ గల నేర్పరి. అటువంటి విష్ణువునే మోహింప చేద్దాం అనుకొని మోహపడిన బ్రహ్మదేవుడు తానే మోహంలో పడ్డవాడు అయిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=533

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...