Thursday 22 November 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 53

10.1-534-తే.
పగలు ఖద్యోతరుచి చెడుపగిది రాత్రి
మంచు చీఁకటి లీనమై మాయుమాడ్కి
విష్ణుపై నన్యమాయలు విశద మగునె? 
చెడి నిజేశుల గరిమంబుఁ జెఱుచుఁ గాక.
10.1-535-వ.
మఱియును.
10.1-536-క.
"పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ; 
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం; 
బిట్టివి నూతన సృష్టులు 
పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్."

భావము:
పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమై పోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వస చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప. అంతట “ఏనాడో పుట్టాను. పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడచిపోయింది. ఇంతవరకూ ఇలా క్రొత్త సృష్టులు పుట్టడం ఎప్పుడూ ఎరుగను. ఔరా! నేను పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=536

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...